Home Movie News ‘లెనిన్’ : శ్రీలీల తప్పుకోవడానికి అసలు కారణం అదే

‘లెనిన్’ : శ్రీలీల తప్పుకోవడానికి అసలు కారణం అదే

lenin

ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా యువ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ మాస్ యాక్షన్ సినిమా లెనిన్. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థలు గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఇందులో అందాల కథానాయక శ్రీలీల హీరోయిన్ గా మొదట ఎంపికయ్యారు.

అయితే కొన్ని సీన్స్ శ్రీలీల పై చిత్రీకరించిన అనంతరం తాజాగా ఆమె సినిమా నుంచి బయటికి రావటం జరిగింది. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఆమె అప్పట్లో డేట్స్ కేటాయించడంతో ఆ సినిమా కొంత లేటుగా తాజాగా ప్రారంభమైంది.

దానితో ఈ సినిమా యొక్క డేట్స్ దానికి క్లాష్ కావడంతో ఆమె లెనిన్ నుంచి బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె స్థానంలో యువ మరొక యువ అందాల నటి భాగ్యశ్రీ బోర్సేని లెనిన్ మూవీలో తీసుకున్నట్టు సమాచారం.

ఇక ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా దర్శకుడు మురళీ కిషోర్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని త్వరలో తమ మూవీలో హీరోయిన్ మార్పుకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ నీ టీం నుంచి అందించినట్టు తెలుస్తోంది. మరి ఈ మూవీ ఎంత మేరకు అఖిల్ కి విజయం అందిస్తుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version