Home Movie News ముగిసిన ఇళయదళపతి విజయ్ మూవీ కెరీర్

ముగిసిన ఇళయదళపతి విజయ్ మూవీ కెరీర్

thalapathy vijay

కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇలయదళపతి విజయ్ ఆఖరి సినిమా జన నాయగన్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తెలుగు మూవీ భగవంత్ కేసరికి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే తో పాటు మమిత బైజు కీలక పాత్రలు చేస్తున్నారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మితమవుతున్న ఈ సినిమాని హెచ్ వినోద్ తీస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో తాజాగా హీరో విజయ్ తన పార్ట్ షూట్ మొత్తం పూర్తి చేసినట్టు తెలుస్తోంది. దీనితో ఇక విజయ్ మూవీ కెరీర్ కి అఫీషియల్ గా ఎండ్ కార్డు పడినట్లే.

అనంతరం పూర్తిగా తన తమిళ వెట్రి కళగం పార్టీ యొక్క పనుల్లో ఆపై రాజకీయాల్లో ఆయన నిమగ్నం కానున్నారు. నిజానికి ఇది విజయ్ ఫ్యాన్స్ కి పూర్తిస్థాయిలో నిరాశ కలిగించే న్యూస్ అని చెప్పాలి.

ఇక జన నాయగన్ మూవీ రానున్న సంక్రాంతి పండుగ కానుకగా భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ఇప్పటివరకు కోలీవుడ్ లో ఉన్న గత రికార్డులు అన్నిటిని తుడిచి పెట్టే అవకాశం గట్టిగా కనబడుతోంది. 

Show comments
Exit mobile version