Home Movie News Super Response for The Paradise Glimpse Teaser ‘ది ప్యారడైజ్’ టీజర్ కి సూపర్...

Super Response for The Paradise Glimpse Teaser ‘ది ప్యారడైజ్’ టీజర్ కి సూపర్ రెస్పాన్స్

the paradise teaser

నాచురల్ స్టార్ నాని తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 3 చేస్తున్నారు. మే 1న ఇది గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. 

అయితే దీని అనంతరం తాజగా దసరా మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో తన నెక్స్ట్ మూవీ కమిట్ అయ్యారు నాని. ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ పై సుధాకర్ చెరుకూరి గ్రాండ్ గా నిర్మించనుండగా అనిరుద్ సంగీతం సమకూర్చనున్నారు. అందరిలో మంచి బజ్ ఏర్పరిచిన ఈ మూవీకి ది ప్యారడైజ్ టైటిల్ ఫిక్స్ చేసి ఇటీవల అనౌన్స్ చేసారు. 

ఇక నిన్న దీని అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. రా, రస్టిక్ అంశాలతో పవర్ఫుల్ డైలాగ్స్ తో రూపొందిన ఈ టీజర్ పై కొందరు విమర్శలు చేసినప్పటికీ ఓవరాల్ గా ది ప్యారడైజ్ టీజర్ మొత్తంగా 24 గంటల్లో 17.12 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. 

టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న గ్లింప్స్ టీజర్స్ లో టాప్ 4 వ స్థానంలో నిలిచింది. తప్పకుండా ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ అంటున్నారు. కాగా ది ప్యారడైజ్ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2026 మార్చి 26న విడుదల చేయనున్నారు. 

Show comments
Exit mobile version