Home Movie News SSMB29 : అక్కడి నుండి బ్రేకుల్లేకుండా దూసుకెళ్లడమేనట

SSMB29 : అక్కడి నుండి బ్రేకుల్లేకుండా దూసుకెళ్లడమేనట

ssmb29

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్రాండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ SSMB29 భారీ స్థాయిలో రూపొందుతోన్న విషయం తెలిసిందే.

లోకం చుట్టే వీరుడి కథగా హాలీవుడ్ రేంజ్ టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతోన్న ఈ మూవీ కోసం ఇప్పటికే ప్రత్యేకంగా క్రాఫ్, గడ్డం తో పాటు బాడీ కూడా పెంచుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

ప్రియాంక చోప్రా తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తున్న ఈమూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తుండగా వి విజయేంద్ర ప్రసాద్ కథ ని అందించారు.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈమూవీ యొక్క మూడవ షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన కాశి సెట్ లో గ్రాండ్ గా జరుగుతుండగా జులై మొదటి వారం నుండి టీమ్ కెన్యా, సౌత్ ఆఫ్రికా, బల్గెరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో చిత్రీకరణ జరుపనున్నట్లు తెలుస్తోంది.

అయితే విషయం ఏమిటంటే, ఫారిన్ వెళ్లిన అనంతరం వరుసగా షెడ్యూల్స్ అన్ని కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా వేగంగా చిత్రీకరణ జరుగనున్నాయట. వీలైనంతవరకు వచ్చే ఏడాది మధ్యలో షూటింగ్ మొత్తం పూర్తి చేసి ఆపైన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ స్టార్ట్ చేయనున్నారని, అలానే మూవీని 2027 సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తుందని సమాచారం.  

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version