Home Movie News ‘హిట్ – 3’ ఓటిటి కి షాకింగ్ రెస్పాన్స్ 

‘హిట్ – 3’ ఓటిటి కి షాకింగ్ రెస్పాన్స్ 

hit 3 review

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి కథానాయికగా యువ దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 3. ఈ మూవీని యునానిమస్ ప్రొడక్షన్స్, వాల్ పోస్టర్ సినిమా సంస్థలు గ్రాండ్ గా నిర్మించగా మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు.

బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ విలన్ గా నటించిన ఈ మూవీ ఇటీవల థియేటర్స్ లో ఆడియన్సు ముందుకి వచ్చి ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా పలు భాషల ఆడియన్సు ముందుకి వచ్చిన ఈ మూవీ తాజాగా షాకింగ్ రెస్పాన్స్ అందుకుంటోంది.

ఆశించిన స్థాయిలో హిట్ 3 మూవీ ఓటిటిలో రెస్పాన్స్ అందుకోవడం లేదు. కాగా ఇది ఒకరకంగా ఈ ఫ్రాంచైజ్ లో త్వరలో రానున్న హిట్ 4 మూవీకి ఒకింత మైనస్ పాయింట్ అని చెప్పాలి. కార్తీ హీరోగా రూపొందనున్న ఈ మూవీ విషయంలో దర్శకుడు శైలేష్ కొలను మరింతగా జాగ్రత్తలు తీసుకునే బెటర్. త్వరలో ఈ మూవీ గురించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version