సరిలేరు నీకెవ్వరూ ఈరోజు తో 50 రోజులు పూర్తీ చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో కమర్షియల్ ఎంటర్టైనర్ గ ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే హైయెస్ట్ షేర్ కలెక్ట్ చేసింది. శ్రీమంతుడు తర్వాత మహేష్ ఎదురు చూస్తున్న బ్లాక్బస్టర్ సరిలేరు నీకెవ్వరూ తో వచ్చింది . భరత్ అనే నేను , మహర్షి సినిమాలు విజయం సాధించిన అవి బ్లాక్బస్టర్ అవ్వలేదు.సరిలేరు నీకెవ్వరూ మొదటి రోజు కొంత వరకు నెగటివ్ టాక్ వచ్చిన అప్పటికి కలెక్షన్స్ లో మాత్రం ఎక్కడ డీలా పడలేదు . మొదటి రోజు నుండి ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళ్లింది. మొదటి వారం లోనే డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తీసుకొని వచ్చి హిట్ జాబితా లోకి చేరుకుంది అలాగే మొదటి వారం ణొన్ బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది. మొదటి వారం తర్వాత కూడా సినిమా ఏ మాత్రం డీలా పడలేదు , అలానే రన్ అవుతూ తెలుగు సినిమా టాప్ 4 షేర్ ఫిలిం గ నిలబడింది.
ఎన్నో మైలురాయి లు మహేష్ ఈ సినిమా తో అందుకున్నాడు . ప్రభాస్ తర్వాత హాట్ట్రిక్ 100 కోట్ల క్లబ్ లో చేరాడు . తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా బాహుబలి1 ని క్రాస్ చేసాడు . ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కడం తో నిర్మాతల కి కూడా ఎక్కువ లాభాలు తీసుకొని వచ్చింది . అనిల్ సుంకర , దిల్ రాజు , మహేష్ బాబు ముగ్గురు కలిసి ఈ సినిమా ని నిర్మించారు . రష్మిక మందాన మొదటి సారి మహేష్ బాబు తో కలిసి నటించింది . దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కి సంగీతం అందించాడు . ప్రతి సినిమా రిలీజ్ తర్వాత ట్రేడ్ లో ఒక అంచనాలు ఉంటాయి ఈ సినిమా ఎంత చేయొచ్చు అని , సరిలేరు నీకెవ్వరూ అందరి అంచనాలకి మించి కలెక్ట్ చెయ్యడం మహేష్ బాబు కి ప్రేక్షకుల లో వున్నా ఆదరణ గురించి చెప్తుంది. మహేష్ బాబు ఎంత గానో నమ్మిన అని రావిపూడి తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు , తన సక్సెస్ కి తిరుగులేదు అని మరో సారి నిరూపించుకున్నాడు . ఎప్పుడెప్పుడు మహేష్ తో బ్లాక్బస్టర్ కొడతాను అని ఎదురు చుసిన నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమా తో కొట్టేసాడు. సరిలేరు నీకెవ్వరూ విజయం మహేష్ కెరీర్ లో ఇంకో స్టెప్ ముందుకు తీసుకెళ్లింది .
We are hiring passionate and enthusiastic content writers who can create original stories. If you are interested in full time, part time or freelancing, email us at jobs@tracktollywood.com. You need to work a 5 hour shift and be available to write articles. Kindly include your sample articles. Applications without sample articles will not be encouraged.