Home Movie News Pushpa 2 Trailer Runtime Locked ‘పుష్ప – 2’ ట్రైలర్ రన్ టైం లాక్

Pushpa 2 Trailer Runtime Locked ‘పుష్ప – 2’ ట్రైలర్ రన్ టైం లాక్

Allu Arjun

టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు కలిగిన ఈ మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెలిసిందే.

ఈ మూవీలో ఫహాద్ ఫాసిల్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్, సినీ, అనసూయ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న పుష్ప 2 మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్, రెండు గ్లింప్స్ టీజర్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. కాగా మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని నవంబర్ 17న పాట్నా లో ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా రిలీజ్ చేయనున్నారు.

అయితే ఈ ట్రైలర్ యొక్క రన్ టైం లాక్ అయింది. కాగా ట్రైలర్ 2 నిమిషాల 44 సెకండ్స్ పాటు సాగనుందని తెలుస్తోంది. ఇక పుష్ప 2 మూవీ రిలీజ్ తరువాత అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ సృష్టిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం పుష్ప 2 ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Show comments
Exit mobile version