Home Movie News ‘మార్కో – 2’ మూవీ రద్దు 

‘మార్కో – 2’ మూవీ రద్దు 

marco

మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ అక్కడక్కడా పలు తెలుగు సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన చేసిన జనతా గ్యారేజ్, భాగమతి సినిమాల్లోని పాత్రలు తెలుగు ఆడియన్స్ నుండి కూడా మంచి పేరు తీసుకువచ్చాయి.

ఇక ఇటీవల మలయాళంలో హనీఫ్ అదేని దర్శకత్వంలో ఆయన చేసిన యాక్షన్ మూవీ మార్కో. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద బాగా సక్సెస్ అందుకోవడంతో పాటు ఓవరాల్ గా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది.

అయితే సినిమా సక్సెస్ అయినప్పటికీ అందులోని భయంకరమైన వయొలెన్స్ సన్నివేశాల పై పలువురు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేసారు. చిన్నపిల్లలతో పాటు ఫ్యామిలీస్ ఆ మూవీ చూడలేరని విమర్శలు కూడా వచ్చాయి.

అందుకే ఓటిటి రిలీజ్ అనంతరం మార్కో మూవీ యొక్క టెలివిజన్ ప్రీమియర్ ని రద్దు చేసారు. అయితే దానికి సీక్వెల్ గా మార్కో 2 తెరకెక్కనుందని ఇటీవల వార్తలు రాగా, అది రద్దయిందని, ఫస్ట్ పార్ట్ కు వచ్చిన నెగటివిటీని దృష్టిలో పెట్టుకుని సీక్వెల్ తీయాలనే ఆలోచన రద్దు చేసినట్లు నటుడు ఉన్ని ముకుందన్ తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఒకరకంగా ఇది మంచి నిర్ణయం అని అంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు. 

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version