Home Movie News ‘కూలీ’ : ట్రోల్స్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసిన లోకేష్ కనకరాజ్

‘కూలీ’ : ట్రోల్స్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసిన లోకేష్ కనకరాజ్

coolie

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కూలీ. శృతిహాసన్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై అన్ని భాషల ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక ఈ సినిమా యొక్క హిందీ వర్షన్ టైటిల్ ని ఇటీవల మజ్దూర్ గా నిర్ణయించి ఇటీవల ఫిక్స్ చేయగా దానిపై పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయి. దానితో దర్శకుడు లోకేష్ కనకరాజ్ దాన్ని గ్రహించి తానే రంగంలోకి దిగి సినిమా యొక్క టైటిల్ ని ఫైనల్ గా కూలీ ది పవర్ హౌస్ గా మార్చారు.

వాస్తవానికి గతంలో అమితాబచ్చన్ తో పాటు గోవిందా, వరుణ్ ధావన్ ల సినిమాలు కూలీ టైటిల్ తో రావటంతో మజ్దూర్ గా ఫిక్స్ చేశారు. అయితే అది మూవీ థియేటర్స్ కి రావడంలో ఆడియన్స్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే టైటిల్ కాదని విమర్శలు రావడంతో కూలీ టీమ్ చేంజ్ చేసే నిర్ణయం తీసుకున్నారు. మరి మొత్తంగా మార్చిన టైటిల్ తో రిలీజ్ అనంతరం కూలీ ది పవర్ హౌస్ ఎంత మేర హిందీలో విజయం అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version