Home Movie News ‘కుబేర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

‘కుబేర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

kubera

వెర్సటైల్ యాక్టర్ ధనుష్, కింగ్ అక్కినేని నాగార్జున క్రేజీ కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కుబేర. ఈమూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే కుబేర నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఆకట్టుకునే కథ, కథనాలతో శేఖర్ కమ్ముల తీస్తున్న ఈమూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని అంటున్నారు మేకర్స్. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందిన ఈమూవీ జూన్ 20న పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే విషయం ఏమిటంటే, రేపు జరగాల్సిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేశారు మూవీ మేకర్స్.

నేడు అహ్మదాబాద్ లో విమానం కూలిన ఘటనలో అనేకమంది మృతి చెందడంతో అందుకు సంతాపంగా దానిని వాయిదా వేశారు. కాగా ఈవెంట్ ఆదివారం జరుగనుందా ప్రత్యేకంగా ధనుష్ కూడా హాజరు కానున్నారట. మొత్తంగా ఈ క్రేజీ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version