Home Movie News Devara Second Song Released మెలోడియస్ గా ‘దేవర’ సెకండ్ సాంగ్

Devara Second Song Released మెలోడియస్ గా ‘దేవర’ సెకండ్ సాంగ్

devara
devara

టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా సైఫ్ ఆలీ ఖాన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు.

రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 27న పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇటీవల దేవర పార్ట్ 1 నుండి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ ఆకట్టుకోగా నేడు మూవీ నుండి చుట్టమల్లే అనే పల్లవితో సాగె మెలోడియస్ రొమాంటిక్ సాంగ్ లిరికల్ వీడియోని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు.

రామ జోగయ్య శాస్త్రి రచించిన ఈ సాంగ్ ని శిల్పరావు అద్భుతంగా పాడగా ఎన్టీఆర్, జాన్వీల లుక్స్, విజువల్స్ కూడా అదిరిపోయాయి. మొత్తంగా ఈ లిరికల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటూ బాగా వ్యూస్ సొంతం చేసుకుంటోంది. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన దేవర పార్ట్ 1 మూవీ, రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Show comments
Exit mobile version