Home Movie News ‘హరి హర వీర మల్లు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

‘హరి హర వీర మల్లు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

hari hara veera mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రిష్, జ్యోతి కృష్ణ కలిసి తీస్తున్న హిస్టారికల్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ హరి హర వీర మల్లు.

ఈ మూవీలో బాబీ డియోల్, పూజితా పొన్నాడ, అనసూయ భరద్వాజ్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి తదితర్లు కీలక  పాత్రలు చేస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మూవీని ఏ ఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన హరి హర వీర మల్లు మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్స్, సాంగ్స్ బాగానే రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదా పడ్డ ఈ మూవీ జులై 24న గ్రాండ్ రిలీజ్ అని ఇటీవల మేకర్స్ అఫీషియల్ డేట్ అనౌన్స్ చేసారు.

ఇక విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని జులై 3న ఉదయం 11 గం. 10 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ యొక్క మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. దీనితో ఇక హరి హర వీర మల్లు రిలీజ్ అయితే వాయిదా పడే ఛాన్స్ లేదని అర్ధం అవుతోంది. మరి రిలీజ్ తరువాత ఈ మూవీ ఎంత రేంజ్ సక్సెస్ అవుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version