Home Movie News హరి హర వీర మల్లు మూడవ సాంగ్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ 

హరి హర వీర మల్లు మూడవ సాంగ్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ 

pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హరి హర వీర మల్లు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని ఎంతో భారీ వ్యయంతో మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు.

ఇప్పటికే అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ జూన్ 12న భారీ స్థాయిలో ఆడియన్సు ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఇటీవల హరి హర వీర మల్లు నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ లో ఫస్ట్ సాంగ్ ఆకట్టుకోలేదు, అయితే సెకండ్ సాంగ్ కి బాగానే రెస్పాన్స్ లభించింది. విషయం ఏమిటంటే ఈ మూవీ నుండి అసుర హననం అనే పల్లవితో సాగే మూడవ సాంగ్ ని 21 మే ఉదయం 11 గం. 55 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు టీమ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.

కాగా ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా కీలక పాత్రల్లో బాబీ డియోల్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, పూజిత పొన్నాడ, అనసూయ నటిస్తున్నారు. మరి పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పర్చిన ఈ మూవీ రిలీజ్ తరువాత ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version