Home Movie News ‘హరి హర వీర మల్లు’ రిలీజ్ వాయిదా ?

‘హరి హర వీర మల్లు’ రిలీజ్ వాయిదా ?

hari hara veera mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏం రత్నం నిర్మిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగాన్ని జూన్ 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ మూవీని క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ గ్రాండ్ గా తెరకెక్కించారు. కీరవాణి సంగీతం అందించిన హరిహర వీరమల్లు మూవీ పై పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే బుధవారం ఈ సినిమాకు సంబంధించినటువంటి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కానున్నాయబు అలానే థియేటర్ ట్రైలర్ జూన్ 5న రిలీజ్ కానుందని ఇటీవల వార్తలు వచ్చాయి.

అయితే లేటెస్ట్ టాలీవడ్ అప్ డే ప్రకారం హరి హర వీర మాల్ మూవీ ఈ కొన్నాళ్ల పాటు వాయిందా పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటికే యుఎస్ఏ లోని ప్రీమియర్స్ టికెట్ బుక్ చేసుకున్న పలువురికి డబ్బులు రిఫండ్ రావడంతో మూవీ రిలీజ్ వాయిదా ఫిక్స్ అని తెలుస్తుంది .అయితే దీని పై మూవీ టీమ్ నుండి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది. కాగా ఈ మూవీ పై ఎన్నో అంచనాలు ఏర్పరుచుకున్న పవన్ ఫ్యాన్స్, మూవీ పలుమార్లు వాయిదా పడడంతో నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. 

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version