Home Movie News ‘హరి హర వీర మల్లు’ రిలీజ్ ఈ నెలలో లేనట్లేనా ?

‘హరి హర వీర మల్లు’ రిలీజ్ ఈ నెలలో లేనట్లేనా ?

hari hara veera mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా తాజాగా జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి కలిసి తెరకెక్కిస్తున్న హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హరి హర వీర మల్లు.

ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా కీలక పాత్రల్లో బాబీ డియోల్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, అనసూయ నటిస్తున్నారు. మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇప్పటికే పలు మార్లు రిలీజ్ వాయిదా పడింది.

ఇక ఇటీవల హరి హర వీర మల్లు నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. వాస్తవానికి జూన్ 12న రిలీజ్ కావాల్సిన తమ మూవీని కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం వలన వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ ఈ నెలలో అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని, పక్కాగా ఇది జులై లో ఆడియన్సు ముందుకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఈ మూవీ యొక్క న్యూ రిలీజ్ డేట్ ని టీమ్ ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో చూడాలి.

Show comments
Exit mobile version