Home Movie News Good News to Charan Fans ‘గేమ్ ఛేంజర్’ : చరణ్ ఫ్యాన్స్ కి గుడ్...

Good News to Charan Fans ‘గేమ్ ఛేంజర్’ : చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

game changer

టాలీవుడ్ స్టార్ యాక్టర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ పొలిటికల్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో దీనిని నిర్మిస్తున్నారు.

రాక్ స్టార్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రలు చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ మూవీలో ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ పాత్రలో కనిపించనుండగా దీనిని డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల గేమ్ ఛేంజర్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది.

విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ నుండి రానున్న సెప్టెంబర్ 7న వినాయకచవితి సందర్భంగా ఒక సర్ప్రైజింగ్ అప్ డేట్ ని అందించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందట. కాగా అది మూవీ యొక్క సెకండ్ సాంగ్ కి సంబంధించిందని అంటున్నారు. మరి ఆ అప్ డేట్ ఏంటో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version