Home Movie News Game Changer Streaming in OTT ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘గేమ్ ఛేంజర్’ 

Game Changer Streaming in OTT ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘గేమ్ ఛేంజర్’ 

game changer

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్ గా కనిపించగా ఇతర కీలక పాత్రల్లో శ్రీకాంత్, రాజీవ్ కనకాల, అంజలి, సముద్రఖని నటించారు. 

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో చరణ్ రెండు పాత్రల్లో కనిపించగా థమన్ సంగీతం సమకూర్చారు. 

శంకర్ మార్క్ టేకింగ్ పూర్తిగా మిస్ అవడంతో పాటు పూర్తిగా పాత పంథాలో సాగిన కథ, ఏమాత్రం ఆకట్టుకోని కథనాలు ఈ మూవీకి ప్రధాన మైనస్ లు. విషయం ఏమిటంటే, తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. 

అత్యంత భారీ ఖర్చుతో రూపొందిన ఈ మూవీ ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద అత్యల్ప కలెక్షన్ మాత్రమే సొంతం చేసుకుని అటు నిర్మాత దిల్ రాజుకి అలానే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు చవిచూసేలా చేసింది. మరి ఓటిటి లో ఈ మూవీకి ఎంత మేర ఆడియన్స్ యొక్క మెప్పు లభిస్తుందో చూడాలి. 

Show comments
Exit mobile version