Home Movie News Game Changer Release Date Fix ‘​గేమ్ చేంజర్’ : ఆ రోజునే రిలీజ్ ఫిక్స్ ?

Game Changer Release Date Fix ‘​గేమ్ చేంజర్’ : ఆ రోజునే రిలీజ్ ఫిక్స్ ?

ghame changer

టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాపవర్ స్టార్ గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ వ్యయంతో నిర్మిస్తుండగా కీలక పాత్రల్లో ఎస్ జె సూర్య, ప్రకాష్ రాజ్, నాజర్, సునీల్, శ్రీకాంత్, అంజలి తదితరులు నటిస్తున్నారు. 

ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయని చెప్పాలి. ఇక గేమ్ ఛేంజర్ మూవీని వాస్తవానికి రానున్న క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని భావించారు మేకర్స్. 

ఇక తాజాగా అందుతున్న న్యూస్ ప్రకారం ఈ మూవీ పక్కాగా 2025 సంక్రాంతికి పోస్ట్ పోన్ ఫిక్స్ అంటున్నారు. అలానే ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి జనవరి 10న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారట. రేపు దీనికి సంబంధించి మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ అందించనున్నట్లు తెలుస్తోంది. 

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version