Home Movie News Game Changer Hindi OTT Streaming available in That ‘గేమ్ ఛేంజర్’ హిందీ ఓటిటి స్ట్రీమింగ్...

Game Changer Hindi OTT Streaming available in That ‘గేమ్ ఛేంజర్’ హిందీ ఓటిటి స్ట్రీమింగ్ అందులోనే

game changer

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ వ్యయంతో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రలో అంజలి కనిపించారు. 

ఇక ఇతర ముఖ్యపాత్రల్లో రాజీవ్ కనకాల, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సముద్రఖని తదితరులు నటించారు. మొదటి నుంచి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా నిలిచింది. 

రామ్ చరణ్ రెండు పాత్రలలో కనిపించిన ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం పెరఫామ్ చేయలేకపోయిన గేమ్ చేజర్ మూవీ ఇటు ఓటిటిలో రిలీజ్ అనంతరం కూడా ఆశించిన రెస్పాన్స్ అయితే అందుకోలేదు. మొత్తంగా రూ. 450 కోట్ల సాధించాల్సిన ఈ సినిమా రూ.195 కోట్ల వద్ద ఆగిపోయింది. 

ఇక సౌత్ ఇండియన్ భాషల్లో ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా హిందీ ఓటిటి హక్కులను ప్రముఖ సంస్థ జీ 5 వారు సొంతం చేసుకున్నారు. విషయం ఏమిటంటే, గేమ్ ఛేంజర్ హిందీ వర్షన్ ఓటిటి నేటి నుండి ఆడియన్స్ కి అందుబాటులోకి వచ్చింది. మరి హిందీ ఆడియన్స్ నుండి గేమ్ చేంజర్ ఏ స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి. 

Show comments
Exit mobile version