Home Movie News సూర్య – వెంకీ అట్లూరి మూవీ స్క్రిప్ట్ లో భారీ మార్పులు

సూర్య – వెంకీ అట్లూరి మూవీ స్క్రిప్ట్ లో భారీ మార్పులు

suriya venky atluri

కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య ఇటీవల రెట్రో మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి యావరేజ్ విజయం అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సూర్య తాజాగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో ఒక సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుండగా మమితా బైజు ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇక ఇటీవల సార్ తో పాటు లక్కీ భాస్కర్ సినిమాలతో రెండు విజయాలు తన ఖాతాలో వేసుకున్న వెంకీ అట్లూరి మొదట సూర్య కోసం వేరొక కథ అనుకున్నారు. కాగా అది మారుతి 800 సిసి కారుకు సంబంధించిన సంజయ్ గాంధీ బయోపిక్. అయితే గతంలో ఇప్పటికే సూర్య జై భీమ్, ఆకాశం నీ హద్దురా వంటి రెండు బయోపిక్ సినిమాలు చేయడంతో ఈ కథను డ్రాప్ చేసి దాని స్థానంలో ఒక మంచి ఎమోషనల్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని సూర్య చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే లాక్ అయిన ఈ స్టోరీ మానవ సంబంధాలతో ఆకట్టుకునే కథ కథనాలతో రూపొందనుందని ఇక ఇందులో సూర్య పాత్ర గతంలో వచ్చిన గజినీ మూవీలోని సంజయ్ రామస్వామి పాత్ర మాదిరిగా యువతతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. కాగా ఈ క్రేజీ సినిమా నెక్స్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version