Home Movie News అఫీషియల్ గా అనౌన్స్ అయిన ‘ఈ నగరానికి ఏమైంది – 2’

అఫీషియల్ గా అనౌన్స్ అయిన ‘ఈ నగరానికి ఏమైంది – 2’

ee nagaraniki emaindi 2

సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పై విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఈ నగరానికి ఏమైంది.

2018లో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం సొంతం చేసుకుంది. తరుణ్ భాస్కర్ తీసిన ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందించారు. ముఖ్యంగా యువతని విశేషంగా ఆకట్టుకున్న ఈ మూవీ యొక్క సీక్వెల్ కోసం అందరూ ఎప్పటినుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

అయితే మొత్తంగా నేడు మూవీ యొక్క సెకండ్ పార్ట్ ని ఒక వీడియో గ్లింప్స్ ద్వారా అనౌన్స్ చేసారు టీమ్  మొదటి భాగంలో నటించిన వారందరూ కూడా ఇందులో నటించనున్నారు. అయితే మొదటి పార్ట్ మొత్తం ఇండియాలో సాగగా కార్తీక్ లాంగ్ టర్మ్ డ్రీమ్ ప్రకారం సెకండ్ పార్ట్ యుఎస్ఏ లో సాగుతుందని గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు.

ప్రస్తుతం వేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ మూవీ త్వరలో రూపొంది ఆపైన రిలీజ్ అనంతరం ఎంతమేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version