Home Movie News Devara Second Trailer Update అందరి చూపు ‘దేవర’ రిలీజ్ ట్రైలర్ వైపు 

Devara Second Trailer Update అందరి చూపు ‘దేవర’ రిలీజ్ ట్రైలర్ వైపు 

devara second trailer

యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ దేవర. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్, పోస్టర్స్ ఇలా అన్ని కూడా అంతకంతకు మూవీ పై మరింతగా అంచనాలు పెంచేసాయి అని చెప్పాలి. 

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ విలన్ గా కనిపించనున్న దేవర మూవీలో ప్రకాష్ రాజ్, అజయ్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు చేస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫి అందిస్తున్నారు. 

విషయం ఏమిటంటే, సెప్టెంబర్ 22న హైదరాబాద్ లో జరుగనున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ ట్రైలర్ ని ప్రత్యేకంగా విడుదల చేయనున్నారట. ఆ ట్రైలర్ లో మరిన్ని యాక్షన్ అంశాలు జోడించారని, తప్పకుండా అది చూసాక దేవర పై అమాంతం అంచనాలు పెరగడం ఖాయమని టాక్. ​మరి రిలీజ్ అనంతరం దేవర ఎంతమేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Show comments
Exit mobile version