Home Movie News Devara Second Song ‘దేవర’ సెకండ్ సాంగ్ అనౌన్స్ మెంట్ కి ముహూర్తం ఫిక్స్

Devara Second Song ‘దేవర’ సెకండ్ సాంగ్ అనౌన్స్ మెంట్ కి ముహూర్తం ఫిక్స్

Devara

గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీ ద్వారా జాన్వి కపూర్ టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

ఇంకా ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో పలువురు టాలీవుడ్ తో పాటు ఇతర భాషల నటులు నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. ఇక ఇప్పటికే దేవర పార్ట్ 1 నుండి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ విశేషమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ నుండి సెకండ్ యొక్క అనౌన్స్ మెంట్ నేడు సాయంత్రం రానుందని లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్ర చేస్తున్న ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. మరి అందరిలో మంచి అంచనాలు కలిగిన దేవర పార్ట్ 1 ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version