Home Movie News అల్లు అర్జున్ – అట్లీ మూవీలో దీపికా పదుకొనె 

అల్లు అర్జున్ – అట్లీ మూవీలో దీపికా పదుకొనె 

allu arjun deepika padukone

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒక భారీ హాలీవుడ్ స్థాయి సైన్స్ ఫిక్షన్ జానర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రిబుల్ రోల్ లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా జాన్వి కపూర్, మృణాల్ ఠాకూర్ తో పాటు తాజాగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కూడా చేరినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా ల స్పిరిట్ సినిమాలో ఆమె నటించాల్సి ఉంది. కానీ కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ ల కారణంగా ఆమె ఆ సినిమా నుంచి తప్పుకొని ఈ సినిమా ఒప్పుకుని దీని యొక్క షూట్లో జాయిన్ అవడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ హాలీవుడ్ స్థాయిలో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా సాయి అభ్యంకర్ సాంగ్స్ అందించనున్నారు. 

అలానే హాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ హాన్స్ జిమ్మర్ దీనికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2026 చివర్లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ త్వరలో రానుంది.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version