Home Movie News Dasara: అల్లు అర్జున్ ఆర్య 2తో పోలికలు ఉన్న దసరా కథ

Dasara: అల్లు అర్జున్ ఆర్య 2తో పోలికలు ఉన్న దసరా కథ

నాని తాజా చిత్రం దసరా కథ అల్లు అర్జున్ ఆర్య 2 తరహాలోనే ఉంటుందని, ఇద్దరు స్నేహితుల ముక్కోణపు లవ్ ట్రాక్ దసరాలో కూడా ఉంటుందని తాజా సమాచారం. అయితే ఈ ట్రయాంగిల్ కథ పర్యవసానాలు మాత్రం ఆ సినిమాతో పోలిస్తే భిన్నంగా ఉంటాయట.

ఆర్య2 సినిమాలో భావోద్వేగాలతో పాటు పాటలు ఎంటర్టైన్మెంట్ వంటి వాటితో సాగితే.. దసరా మాత్రం హై ఎండ్ మాస్ టోన్, ఎమోషనల్ మూమెంట్స్ తో రూపొందుతుందని అంటున్నారు. హై ఇంటెన్స్ టేకింగ్ తో మునుపెన్నడూ కనిపించని పాత్రలో నానిని ఈ చిత్రంలో చూడబోతున్నామని దసరా ట్రైలర్ ఇప్పటికే స్పష్టమైన హింట్ ఇచ్చింది.

హీరో, హీరో స్నేహితుడు, హీరోయిన్, విలన్ అనే నాలుగు ప్రధాన పాత్రల మధ్య దసరా కథ ముడిపడి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా హీరో స్నేహితుడి పాత్ర సినిమాకు చాలా కీలకం కానుందని, తన పాత్ర చుట్టూ ఉండే ఎమోషనల్ అంశం సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని సమాచారం.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత.

నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్, సాయి కుమార్, రాజశేఖర్ అనింగి తదితరులు నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ , మలయాళ భాష ల్లో మార్చి 30న ఈ చిత్రాన్ని విడుద ల చేయ నున్నారు. తెలంగాణలోని రామగుండం గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version