Home Movie News Daaku Maharaaj OTT Available in Five Languages ఐదు భాషల్లో ‘డాకు మహారాజ్’ ఓటిటి రిలీజ్ 

Daaku Maharaaj OTT Available in Five Languages ఐదు భాషల్లో ‘డాకు మహారాజ్’ ఓటిటి రిలీజ్ 

daaku maharaaj

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ డాకు మహారాజ్. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలోని కీలకపాత్రల్లో బాబీ డియోల్, శ్రద్ధ శ్రీనాథ్, సచిన్ ఖేడేకర్, చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా నటించారు. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. 

బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్. థియేటర్స్ లో బాగానే కలెక్షన్ రాబట్టిన డాకు మహారాజ్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ లెవెల్ లో నిర్మించారు. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 21న ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి రానుంది. 

అయితే విషయం ఏమిటంటే మొత్తంగా ఐదు పాన్ ఇండియన్ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. తెలుగుతోపాటు కన్నడ, హిందీ, మలయాళం, తమిళంలో కూడా ఈ సినిమా ఓటిటి ఆడియన్స్ ని అలరించనుంది. మరి డాకు మహారాజ్ ఎంత మేర ఓటిటి ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి

Show comments
Exit mobile version