Home Movie News ఆల్ టైం రికార్డు ధరకు అమ్ముడైన ‘కూలీ’ ఓవర్సీస్ రైట్స్ 

ఆల్ టైం రికార్డు ధరకు అమ్ముడైన ‘కూలీ’ ఓవర్సీస్ రైట్స్ 

coolie

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ కూలీ. ఈ మూవీలో శృతి హాసన్ తో పాటు ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

ఆగష్టు 14న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం వేగవంతంగా జరుగుతోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది.

అయితే విషయం  ఏమిటంటే, తాజాగా కూలీ మూవీ యొక్క ఓవర్సీస్ రైట్స్ ఆల్ టైం రికార్డు ధరకు అమ్ముడయి సెన్సేషన్ సృష్టించాయి. మొత్తంగా ఈ మూవీ యొక్క రైట్స్ రూ. 81 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. కాగా మినిమిమ్ గ్యారెంటీ డీల్ కింద ఫైనల్ అయిన ఈ రైట్స్ ఓవరాల్ గా కోలీవుడ్ మొత్తంలోనే అత్యధిక ధర కావడం విశేషం.

తొలిసారిగా లోకేష్ తో రజినీకాంత్ వర్క్ చేస్తుండడంతో పాటు పలువురు స్టార్స్ కీలక పాత్రలు చేస్తుండడం వలన కూలీ పై తమిళ్ తో పాటు అన్ని భాషల ఆడియన్స్ లో ఎంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి రిలీజ్ అనంతరం ఇది ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version