Home Movie News Vishwambhara ‘విశ్వంభర’ లో మ్యూజిక్ మాత్రమే కాదు, అది కూడా సూపరట

Vishwambhara ‘విశ్వంభర’ లో మ్యూజిక్ మాత్రమే కాదు, అది కూడా సూపరట

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ యాక్షన్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర. ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ప్రారంభము నాటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు కలిగిన విశ్వంభర మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి టీమ్ గ్రాండ్ గా మ్యూజిక్ సిట్టింగ్స్ ని ప్రారంభించింది. ఈ సందర్భంగా టీమ్ తో కలిసి మెగాస్టార్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం విశ్వంభర పై ఎంతో గట్టిగా దృష్టి పెట్టారట సంగీత దర్శకడు కీరవాణి, అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీలో మొత్తంగా ఐదు సాంగ్స్ తో పాటు బ్యాక్ మ్యూజిక్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండేలా కీరవాణి కసరత్తు చేస్తున్నారని టాక్. మొత్తంగా విశ్వంభర టీమ్ మొత్తం కూడా అవుట్ పుట్ అదిరిపోయేలా శ్రమిస్తున్నట్లు చెప్తున్నారు. కాగా ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version