Home Movie News ‘రాబిన్ హుడ్’ టీమ్ కి ఊహించని బిగ్ షాక్

‘రాబిన్ హుడ్’ టీమ్ కి ఊహించని బిగ్ షాక్

adhi dha surprisu

యువ నటుడు నితిన్ హీరోగా అందాల నటి శ్రీలీల హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్, పోస్టర్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తోంది మూవీ యూనిట్. 

నితిన్ ఇందులో ఒక దొంగ పాత్ర చేస్తుండగా ముఖ్య పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్నారు. మార్చి 28న రాబిన్ హుడ్ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సమయంలో మూవీ టీమ్ కి ఊహించని బిగ్ షాక్ తగిలింది. ఇటీవల మూవీ నుండి కేతిక శర్మ పై చిత్రీకరించిన ప్రత్యేక ఐటెం సాంగ్ అదిదా సర్ప్రైజ్ లిరికల్ వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ఆ సాంగ్ పై సోషల్ మీడియాలో విపరీతంగా రీల్స్ కూడా వచ్చాయి. 

కాగా ఆ సాంగ్ ని సినిమా నుండి తొలగించాలని నేడు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ రాబిన్‌హుడ్ చిత్ర బృందాన్ని కోరింది. ఆ సాంగ్ తో పాటు అందులోని స్టెప్స్ మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని వారు అంటున్నారు. మరి మహిళా కమిషన్ యొక్క ఈ అభ్యర్ధనకి రాబిన్ హుడ్ మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version