Home Movie News Mahesh Babu: మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా ఆల్టర్నేట్ రిలీజ్ ప్లాన్స్

Mahesh Babu: మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా ఆల్టర్నేట్ రిలీజ్ ప్లాన్స్

జనవరి 18 నుంచి మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఆగస్టు 11న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తేదీకి అనుగుణంగా ఉండేలా షూటింగ్ షెడ్యూల్స్ ను కూడా సిద్ధం చేశారు. అయితే ఏ కారణం చేతనైనా సినిమా షూటింగ్ ఆలస్యమైతే మరో తేదీని కూడా SSMB28 టీం సిద్ధంగా పెట్టుకుంది.

ఆ రకంగా షూటింగ్ సమయంలో ఏదైనా ఆలస్యమైతే దసరా లేదా దీపావళి సీజన్ లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను ఎలాగైనా 2023లో విడుదల చేయాలనుకుంటున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో మహేష్ బాబు నటించిన SSMB28 ఒకటి. దాదాపు 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్, మహేష్ కలయికలో వస్తున్న ఈ సినిమా పై మహేష్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మహర్షి తర్వాత మహేష్ బాబు సరసన పూజా హెగ్డే రెండోసారి నటిస్తుండగా, మిగతా తారాగణం వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తారని గతంలో చాలా రూమర్స్ వచ్చాయి కానీ నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో SSMB28 అనేది ఒక అవుట్ అండ్ అవుట్ తెలుగు సినిమాగానే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version