Home Movie News నీల్ మూవీ రిలీజ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తి

నీల్ మూవీ రిలీజ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తి

ntr neel

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తాజాగా రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అందులో ఒకటి హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో చేస్తున్న వార్ 2 కాగా మరొకటి ప్రశాంత్ నీల్ తీస్తున్న మాస్ యాక్షన్ పాన్ వరల్డ్ మూవీ. ఈ రెండు సినిమాల పై దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్సు లో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి.

వీటిలో వార్ 2 ఆగష్టు 14న రిలీజ్ కానుండగా నీల్ మూవీని వచ్చే ఏడాది జూన్ 25 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా డేట్ అనౌన్స్ చేసారు. అయితే ఈ రిలీజ్ డేట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం అదే సమయంలో పలు హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతుండడం.

అయితే ఇటు ఇండియాలో మాత్రం దాదాపుగా ఆ మూవీకి పెద్దగా పోటీ చిత్రాలు ఏవి రిలీజ్ అవ్వడం లేదు. వాస్తవానికి అదే రిలీజ్ డేట్ కి ఇటీవల కల్కి 2898 ఏడి మూవీ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. మరి ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర ప్రభంజజం సృష్టిస్తుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version